: వైఎస్సార్సీపీ సభకు భారీ బందోబస్తు: కమిషనర్ అనురాగ్ శర్మ
ఈ నెల 26వ తేదీన హైదరాబాదులో వైఎస్సార్సీపీ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. సభ జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. దీని కోసం, కేంద్ర బలగాలతో పాటు 36 ప్లటూన్ల ఏపీఎస్పీ దళాలు, 1800 మంది సాధారణ పోలీసులను నియమించనున్నట్టు తెలిపారు.