: కాంగ్రెస్ మరో పాతికేళ్లు కోలుకోలేదు: జేసీ ప్రభాకర్ రెడ్డి


ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పాతికేళ్ల వరకు కోలుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై అన్ని పార్టీలు లేఖలిచ్చినా ప్రజలు కాంగ్రెస్ నే దోషిగా చూస్తున్నారని అన్నారు. పార్టీ మార్పుపై ఏ నిర్ణయం తీసుకోలేదని.. చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే, పార్టీ మారడం తన సోదరుడు దివాకర్ రెడ్డికి ఇష్టం లేదని స్పష్టం చేశారు. తాడిపత్రి నుంచి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ పోటీచేసే అవకాశం ఉందని అన్నారు. తమను పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అయితే, పయ్యావులతో తాము చర్చించినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.

  • Loading...

More Telugu News