: చిన్నారి చేతిలో రూ. 36 లక్షల వజ్రం


మీకు విలువైన వజ్రం కావాలా? అయితే అమెరికాలోని అర్కన్సాస్ క్రేటర్ ఆఫ్ డైమండ్స్ పార్క్ కు వెళ్లాల్సిందే. ఇది వజ్రాల పార్క్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి ప్రజలను అనుమతిస్తారు. వజ్రం దొరికితే ఎంచక్కా తీసుకెళ్లిపోవచ్చు. ఇలానే ఓక్లహామా పట్టణానికి చెందిన 14 ఏళ్ల తానా క్లయిమర్ కూడా తల్లిదండ్రులతో కలిసి ఈ పార్క్ కు వెళ్లింది. అంతే ఆమె అదృష్టం పండింది. రెండుగంటల శోధన తర్వాత క్లయిమర్ కు 3.85 క్యారట్ల వజ్రం దొరికింది. దీని ధర 36 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

  • Loading...

More Telugu News