: తొమ్మిది మంది హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణం
రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన తొమ్మిది మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిసేన్ గుప్తా... ఈ ఉదయం ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన వారంతా జిల్లా జడ్జిలుగా పనిచేసి హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. వీరిలో బులుసు శివశంకరరావు, ఎం.సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్పాక దుర్గాప్రసాదరావు, మల్లవోలు సత్యనారాయణమూర్తి, తాళ్లూరి సునీల్ చౌదరి, మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్, అనీస్, అంబటి శంకరనారాయణ ఉన్నారు.