: జైల్లో ఖాళీగా సమయాన్ని గడుపుతున్న లాలూ


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఎలాంటి పని లేకుండా ఖాళీగా సమయాన్ని గడుపుతున్నారు. అప్పుడప్పుడూ టీవీ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు ఎలాంటి పని ఇవ్వలేదని, దాంతోనే ఖాళీగా ఉన్నారని ఓ అధికారి తెలిపారు. అయితే, వచ్చేనెల ఏదో ఒక పని కేటాయించవచ్చని చెబుతున్నారు. దాణా స్కాంలో ఐదు సంవత్సరాల శిక్ష విధించడంతో జైల్లో ఉంటున్న లాలూ.. జైలు నిబంధనల ప్రకారం తన ఖర్చుల కోసం కొంత సంపాదించాల్సి ఉంటుంది. కాగా, ఆయనకు ఎలాంటి పని ఇవ్వాలన్న దానిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని జైలు సూపరింటెండెంట్ వీరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. కాగా, జైల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి ఉద్యోగం లాలూకు ఇవ్వొచ్చని చెప్పారు.

  • Loading...

More Telugu News