: లాకప్ కు కన్నమేసి ముగ్గురు పరారీ
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లోని లాకప్ గదిలో ఉన్న ముగ్గురు నిందితులు పోలీసులకే సవాల్ విసిరారు. నిన్న రాత్రి సైలెంట్ గా లాకప్ కు కన్నం వేసి చీకట్లో జారుకున్నారు. జరిగిన సంఘటనను తీరిగ్గా గుర్తించిన పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనైంది. చేసేదేమీ లేక పారిపోయిన పోటుగాళ్లను పట్టుకోవడానికి చెట్టూ, పుట్టా గాలిస్తున్నారు.