: సమావేశాలు ... చర్చలు ... ఢిల్లీ లో గవర్నర్ బిజీ బిజీ!
రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరంతో భేటీ అవుతున్నారు. అనంతరం రక్షణ మంత్రి ఆంటోనీతోనూ భేటీ అయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇక సాయంత్రం 5.15 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీతోనూ సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. రేపు(గురువారం) సోనియా గాంధీతో పాటు, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేని కలుస్తారు.
ప్రధానమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చేవరకు ఢిల్లీ లోనే ఉండి, ఆయనతో భేటీ అయ్యాక శుక్రవారం హైదరాబాద్ తిరిగి వస్తారు. హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్న అంశంపై ఆయన నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కొందరు, వద్దని మరికొందరు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో గవర్నర్ మంత్రుల బృందానికి ఏం చెబుతారన్నది ఇప్పుడు కీలకంకానుంది.