: భద్రతా సిబ్బంది అదుపులో ముగ్గురు బాలికలు


పెద్దలు మందలించారని హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన ముగ్గురు బాలికలు పారిపోవడానికి ప్రయత్నించారు. ఇంట్లో వారికి తెలియకుండా గోవా పారిపోయేందుకు ప్రయత్నించిన వీరిని శంషాబాద్ ఎయిర్ పోర్టు సీఐఎస్ ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులకు అప్పగించారు. దీంతో, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ బాలికల వద్ద ఆధార్ కార్డు, కొంత నగదు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే వీరి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News