: ఈ కుర్చీ పైనుండి చూస్తే అద్భుతమే...


కొండల్ని ఎక్కడం హాబీగా ఉండేవారికి కొండను ఎక్కుతూ అలసిపోతే ఎక్కడైనా కూర్చుని సేద తీరాలనుకుంటే ఎలా... అలాంటి వారికోసం డిజైనర్లు ఒక స్పెషల్‌ కుర్చీని తయారుచేశారు. అంతేకాదు ఈ కుర్చీని చక్కగా ఒక పర్వతానికి తగిలించేశారు కూడా. దీంతో ఆ పర్వతాన్ని ఎక్కడం సంగతి తర్వాత ఆ కుర్చీ ఉన్నదాకా ఎక్కి దానిపై కూర్చుని అంత ఎత్తునుండి నగరం అందాలను చూడడానికే ఎక్కువమంది ఔత్సాహికులు వస్తున్నారట.

డాలిన్‌ స్మిత్‌ అనే డిజైనర్‌ ఒక ప్రత్యేకమైన కుర్చీని తయారుచేశాడు. ఈ కుర్చీని పర్వతారోహకులు రెస్ట్‌ తీసుకోవడానికి వీలుగా ఉండేలా తయారుచేశాడు. అంతేకాదు దీన్ని ప్రోవోలోని రాక్‌ కెన్యాకు తగిలించేశాడు. 360 అడుగుల ఎత్తులో అమర్చిన ఈ కుర్చీకి డిమాండ్‌ కూడా బాగానే పెరిగిందట. ఎందుకంటే అంత ఎత్తున కూర్చుని ప్రకృతి అందాలను చూస్తూ రెస్ట్‌ తీసుకునే పర్వతారోహకుల సంఖ్య రోజురోజుకూ బాగా పెరుగుతోందట.

  • Loading...

More Telugu News