: పనికిరాని వస్తువేదీ లేదా...?
కుక్కపిల్లా... అగ్గిపుల్లా... సబ్బుబిళ్లా... ఇలా దేనితోనైనా కవితను రాసేయొచ్చంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పాడు. అలాగే అరిగిపోయిన చెప్పును మనం ఏం చేస్తాం... విసిరి చెత్తబుట్టలో పడేస్తాం. కానీ అరిగిన చెప్పునుండి కూడా ఉపయోపడే పదార్ధాలను వెలికితీయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
కాలి చెప్పులు, షూలు అరిగిపోయాక మనం వాటిని పడేస్తాం. కానీ అలా పనికిరావని పారవేసే చెప్పులు, షూలతో కూడా ప్రయోజనం ఉంటుందని బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా పనికిరాని చెప్పులనుండి పనికొచ్చే పదార్ధాలను వెలికితీయవచ్చని, ఇలాంటి సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చెప్పులు ఎంతగా అరిగిపోయినా అందులో ఉండే తోలు, పైనుండే ప్లాస్టిక్ వస్తువుల, రబ్బరులను తిరిగి ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి సరికొత్త విధానాన్ని లాబరో విశ్వవిద్యాలయంలోని ఇన్నోవేటివ్ మానుఫాక్చరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ రీసెర్చ్ సెంటర్‌లో పరీక్షించారు. షూలలో దాదాపు 40 వేరువేరు పదార్ధాలు ఉంటాయని, వాటిని సాధారణ పద్ధతుల్లో మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం కష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.