: నెల్లూరు వద్ద బంగాళాఖాతంలో అల్పపీడనం
నెల్లూరు వద్ద బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. దీని ప్రభావంతో ఇప్పటికే కోస్తాలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.