: ఫైలిన్ తుపాను బాధితులకు యూరోపియన్ కమిషన్ సహాయం
ఫైలిన్ తుపాను సృష్టించిన బీభత్సంతో నష్టపోయిన బాధితులకు యూరోపియన్ కమిషన్ తనవంతు సహాయం ప్రకటించింది. ఈ మేరకు 'రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్' సంస్థ విపత్తు నివారణ నిధికి రూ. 81 లక్షలు విరాళంగా అందించింది. తుపాను కారణంగా 15వేల కుటుంబాలు నష్టపోయినట్లు అంచనాలు వెలువడిన నేపథ్యంలో యూరోపియన్ కమిషన్ వెంటనే స్పందించింది. నిధులను సహాయ కార్యక్రమాల కోసం ఉపయోగించాలని 'రెడ్ క్రాస్' ను కోరింది. కాగా, తుపానుతో ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ప్రజల మౌలిక సదుపాయాలు, ఇళ్లు, జీవనాధారం మొత్తం నాశనమయ్యాయి. దాంతో, అనేకమంది ప్రజలు తక్షణ సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు.