: రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి: అశోక్ బాబు


రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్న రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఆయన మాట్లాడారు. 'మీపైన ఉన్న నమ్మకంతో మిమ్మల్ని గెలిపించిన పుణ్యానికి మీరు అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించండి... తర్వాత జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకుల కాళ్లు పట్టుకుని మేం బిల్లును అడ్డుకుంటాం' అని అశోక్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కడదాకా పోరాడతామని తెలిపారు. ఉద్యమంలో పాల్గొంటున్న తాము ఎలాంటి రాజకీయ పదవులను ఆశించడం లేదని చెప్పారు.

పార్టీని చూసి మనం ఓటేస్తే... ఆ పార్టీనీ మరో పార్టీలో కలిపేసే ప్రమాదం ఉందని అశోక్ బాబు హెచ్చరించారు. సీమాంధ్రలో జరుగుతున్నది ప్రజా ఉద్యమమే కాని రాజకీయ ఉద్యమం కాదని అశోక్ బాబు తెలిపారు. వర్షంలో తడిసి, ఎండకు ఎండి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. 2014 వరకు రాష్ట్రాన్ని తాము సమైక్యంగా ఉంచుతామని... తర్వాత రాజకీయ నాయకులే ఆ బాధ్యత తీసుకోవాలని అశోక్ బాబు కోరారు.

  • Loading...

More Telugu News