: మహబూబ్ నగర్ నుంచి ఎవరు బరిలో దిగినా పోటీకి నేను సిద్ధం: నాగం
మహబూబ్ నగర్ నుంచి సోనియా, రాహుల్ ఎవరు బరిలో దిగినా తాను పోటీకి సిద్ధమేనని బీజేపీ నేత నాగం జనార్ధన రెడ్డి చెప్పారు. తనపై పోటీ చేసే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ లేకే రాహుల్ వద్దకు వెళ్లారని ఎద్దేవా చేశారు. కాగా, విభజన సమయంలో తెలంగాణకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నాగం డిమాండ్ చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి పార్టీ పరంగా జీవోఎం (కేంద్ర మంత్రుల బృందం) కు ఒకే నివేదిక ఇస్తామన్నారు.