: విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా అరెస్ట్
విశాఖలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. స్థానిక బీచ్ రోడ్డు వద్ద అఫీషియల్ కాలనీలోని ఓ అపార్ట్ మెంటులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. దాడిలో భార్యాభర్తల సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార ముఠా నిర్వాహకుడు వీకె రెడ్డి, బ్రోకర్ జిలానీలు పరారీలో ఉన్నారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముఠా ఆధీనంలో ఉన్న తిరుపతికి చెందిన ఇద్దరు బాలికలను రక్షించి... చైల్డ్ హోమ్ కు తరలించారు.