: రాందేవ్ వ్యాఖ్యలను ఖండించిన దిగ్విజయ్
కాంగ్రెస్ తనపై కుట్ర చేస్తోందంటూ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఖండించారు. రాందేవ్ కుట్ర చేయాల్సినంత ప్రముఖుడేమీ కాదన్నారు. అతనికి అంత స్థాయి లేదన్నారు. రాందేవ్ కుటుంబ సభ్యులు ఎవరినో కిడ్నాప్ చేస్తే అది కాంగ్రెస్ కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. అందుకు ఆయనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని దిగ్విజయ్ అన్నారు.