: చైనా పెట్టుబడులను భారత్ స్వాగతిస్తుంది: ప్రధాని మన్మోహన్
రష్యా పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు చైనా పర్యటనకు వెళ్ళారు. మూడు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య సంబంధాలపై చెైనా ప్రధానితో మన్మోహన్ చర్చించే అవకాశం ఉంది. కాగా, చైనా మీడియాతో ప్రధాని మాట్లాడుతూ.. భారత్ లో చైనా పెట్టుబడులను స్వాగతిస్తామన్నారు. అంతేకాక, ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న భారత్ లో చైనీస్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కూడా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు. చైనా పెట్టుబడుల ద్వారా వాణిజ్య లోటును అధిగమించవచ్చని మన్మోహన్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు 'జిన్హువా' వార్తా సంస్థ పేర్కొంది.