: నాపై ఛార్జిషీటు దాఖలు చేయడం సిగ్గుచేటు: ఐఏఎస్ అధికారి ఖేమ్కా
హర్యానా కేడర్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా హర్యానా రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటైన లేఖ రాశారు. ఖేమ్కా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్నప్పుడు విత్తనాల విక్రయం ఎందుకు తక్కువగా ఉందంటూ హర్యానా ప్రభుత్వం ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయంలో తనను నేరుగా ప్రశ్నించకుండా బహిరంగంగా ఆరోపణలు చేయడం, చర్యలకు ఉపక్రమించడం సరైన చర్య కాదని ఖేమ్కా తెలిపారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తన పరువు తీసి, మానసికంగా తనను వేధించడానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనపడుతోందని అన్నారు. ఇది సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ నిర్ణయం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆరోపించారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా వ్యవహారంలో తాను చర్యలు తీసుకోవడమే వీటన్నిటికీ కారణమని తెలిపారు.