: చిరంజీవి స్థానాన్ని పవన్ కల్యాణ్ ఆక్రమించారు: మంత్రి గంటా
రాష్ట్ర ప్రజల్లోనూ, అభిమానుల్లోనూ చిరంజీవికి ఉన్న స్థానాన్ని పవన్ కల్యాణ్ ఆక్రమించారని.. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎంతో మంది ప్రజలు పవన్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. అయితే, పవన్ కల్యాణ్ మనసులో ఏముందో తనకు తెలియదని గంటా తెలిపారు.