: విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖాళీ: టీజీ
విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగితే చాలా మంది పార్టీని వీడతారన్నారు. దిగ్విజయ్ సింగ్ చెప్పినవన్నీ జరగడం లేదని, అందుకే తాము విభజనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రాయలసీమ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అనివార్యమైతే సొంత పార్టీ పెట్టాలని సీఎంపై ఒత్తిడి వచ్చే అవకాశముందని టీజీ తెలిపారు.