: మాయమైపోతున్నారమ్మో పిల్లలు..


దేశంలో ఏటేటా వేలాది మంది చిన్నారులు మాయమైపోతున్నారు. వీరి లెక్క ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది. 'చైల్డ్ ఇన్ నీడ్ ఇన్స్టిట్యూట్' దీనికి సంబంధించి ఒక అధ్యయనం జరిపి నివేదిక వెల్లడించింది. పశ్చిమబెంగాల్లో గతేడాది 19వేల మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. దేశంలో ఈ రాష్ట్రం నుంచే ఎక్కువ మంది కనిపించకుండా పోయారు. పర్యాటక ప్రాంతం డార్జిలింగ్ లో అయితే 924 మంది మాయమయ్యారు. వీరిలో ఎక్కువ శాతం ఆడపిల్లలు ఉండడం గమనార్హం. వీరిని దేశ సరిహద్దులు దాటించి ఇళ్లలో, ఫ్యాక్టరీలలో పనివారిగా, వ్యభిచార కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. పోలీసులు మొక్కుబడిగా కేసులు నమోదు చేసుకుని తూతూ మంత్రంగా గస్తీ నిర్వహించడం వల్ల మనుషుల అక్రమ రవాణాదారులకు కలిసివస్తోంది.

  • Loading...

More Telugu News