: చొరబాట్లపై కేంద్రం ఆందోళన చెందుతోంది: షిండే


జమ్మూకాశ్మీర్ సరిహద్దు వద్ద పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లపై కేంద్రం ఆందోళన చెందుతోందని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు జరుపుతున్న ప్రాంతాలను ఆయన నేడు సందర్శించారు. ఈ సందర్భంగా సాంబా సెక్టార్లో భద్రత బలగాలనుద్దేశించి మాట్లాడుతూ, గత ఏడాది ఈ చొరబాట్లు పెద్దగా ఆందోళన కలిగించలేదని, కానీ, ఈ ఏడాది చొరబాటు ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని చెప్పారు. చొరబాట్లకు గల కారణాలపై సైనికాధికారులతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు పాక్ రేంజర్లు 136 పర్యాయాలు భారత సైనిక శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టడమే పాక్ సైన్యం పన్నాగంగా అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News