: సాఫ్ట్ డ్రింక్స్ ను తరచూ తనిఖీ చేయాలని సుప్రీం ఆదేశాలు
సాఫ్ట్ డ్రింక్స్ ప్రమాణాలను తరచూ తనిఖీ చేయాలని ఆహార భద్రత, ప్రమాణాల విభాగం అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్బోనేటెడ్(వాయువు నింపిన కూల్ డ్రింక్స్) సాఫ్ట్ డ్రింక్స్ అంశం రాజ్యాంగం కల్పించిన భద్రతతో కూడిన జీవన హక్కు కిందకు వస్తుందని ధర్మాసనం పేర్కొంది. ప్రజలపై దుష్ప్రభావం పడకుండా సాఫ్ట్ డ్రింక్స్ ను నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక ప్యానెల్ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేస్తూ పై ఆదేశాలు జారీ చేసింది