: చెమటోడ్చుతున్న ఇషాంత్ శర్మ


మొహాలీ వన్డేలో ఒక్క ఓవర్లోనే 30 పరుగులు ఇచ్చి ఆసీస్ విజయానికి కారణమైన ఇషాంత్ శర్మ నెట్స్ లో చెమటోడ్చుతున్నాడు. ఆసీస్ తో రేపు రాంచీలో నాలుగో వన్డే జరగనున్న నేపథ్యంలో, తనపై పడ్డ మచ్చను చెరిపివేసుకోవాలని ఈ ఢిల్లీ పేసర్ కృతనిశ్చయంతో ఉన్నాడు. మొహాలీ వన్డే ఓటమితో భారత్ ఏడు వన్డేల సిరీస్ లో 1-2తో వెనకబడగా.. విమర్శకులకు ఇషాంత్ లక్ష్యంగా మారిన సంగతి తెలిసిందే.

అందుకే, వారందరికీ తన ప్రదర్శనతోనే బదులివ్వాలని భావిస్తున్న లంబూ.. బౌలింగ్ కోచ్ జో డాస్ పర్యవేక్షణలో అస్త్రాలకు మరింత మెరుగులద్దే పనిలో నిమగ్నమయ్యాడు. సహచరులందరూ విశ్రాంతి తీసుకుంటున్నా, తాను మాత్రం కసిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇషాంత్ శ్రమ ఎలాంటి ఫలితాన్నిస్తుందో రేపటి మ్యాచ్ లోగానీ తెలియదు. కాగా, మ్యాచ్ కు వేదికైన రాంచీలో వర్షాలు పడుతుండడం జార్ఖండ్ క్రికెట్ సంఘానికి ఆందోళన కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News