: కాంగ్రెస్ తరపున సచిన్ ప్రచారం?


సచిన్ టెండూల్కర్.. ప్రతీ ఇంటిలోనూ ఈ క్రికెట్ వీరుడి అభిమాని ఒకరైనా ఉంటారు. ఈ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకుందామని కాంగ్రెస్ ఆశపడుతోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల సందర్భంగా సచిన్ ను ప్రచారానికి దింపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మధ్యప్రదేశ్ ఎన్నికల కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ అయిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయమై త్వరలోనే సచిన్ తో మాట్లాడనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ శ్రేణులు తెలిపాయి. 200వ టెస్ట్ అయిన తర్వాత సచిన్ ను కాంగ్రెస్ ఆహ్వానించడం ఖాయమే! మరి సచిన్ 'ఊ' కొడతారా.. 'ఉహూ' అంటారా చూడాల్సిందే.

  • Loading...

More Telugu News