: కూడంకుళం నుంచి ప్రారంభమైన విద్యుత్ సరఫరా


తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. గత అర్థరాత్రి ఈ ప్లాంట్ నుంచి సదరన్ గ్రిడ్ కు 75 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేశారు. దీంతో, దక్షిణాది రాష్ట్రాల కరెంటు కష్టాలు గణనీయంగా తీరనున్నాయి. రష్యా సహకారంతో ఈ అణువిద్యుత్కేంద్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్.. కూడంకుళంలో మరికొన్ని రియాక్టర్లను నెలకొల్పేందుకు ఒప్పందం ప్రకారం సహకరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కోరనున్నారు. ఈ ప్లాంట్ స్థాపనపై తమిళనాడులో నిరసనలు మిన్నంటినా, మే నెలలో సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపడంతో కేంద్రానికి ఊరట లభించింది.

  • Loading...

More Telugu News