: టీచర్ ను కాల్చి, తనను తాను కాల్చుకున్న స్కూల్ విద్యార్థి
అమెరికాలో మరో విద్యార్థి తుపాకీతో చెలరేగిపోయాడు. ఆయుధంతో స్కూల్ కు వచ్చి తోటి విద్యార్థులకు రక్షణగా నిలిచిన మ్యాథ్స్ టీచర్ పై కాల్పులు జరిపాడు. తర్వాత, అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ప్రాణం విడిచాడు. నెవెడాలోలోని స్పార్క్స్ స్కూల్లో సోమవారం ఇది జరిగింది. మరో ఇద్దరికి గాయాలవగా, వారికి చికిత్సనందిస్తున్నారు.