: పాక్ తోక వంకర


పాకిస్థాన్ ప్రవర్తన కుక్కతోక వంకరలా తయారైంది. ఎన్ని హెచ్చరికలు చేసినా, ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తన బుద్ధి మాత్రం మార్చుకోవట్లేదు. తాజాగా పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆర్ఎస్ పురా సెక్టార్ లోని అబ్దులియాన్ ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. అయితే పాక్ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. మరోవైపు, సాంబా సెక్టార్ లో కేంద్ర హోం మంత్రి షిండే పర్యటిస్తున్నారు. కాగా, ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశంలో అగ్రరాజ్యం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News