: హైదరాబాదులో 30 తులాల బంగారం చోరీ


హైదరాబాదులో దొంగలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పగలు, రాత్రి అనే తేడాలేకుండా చోర శిఖామణులు రెండు చేతులా దోచుకుంటున్నారు. నిన్న అర్థరాత్రి హైదరాబాద్ శివార్లలోని బీరంగూడలో భారీ చోరీ జరిగింది. హైదరాబాద్-మెదక్ జాతీయ రహదారిపై పటాన్ చెరు మండలంలో ఉండే ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 30 తులాల బంగారం, 40 తులాల వెండి అపహరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News