: కర్నూలు మార్కెట్ యార్డ్ లో పత్తి రైతుల ఆందోళన
కర్నూలు జిల్లాలోని ఆదోని మార్కెట్ యార్డ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మార్కెట్ యార్డ్ లో 60 వేల క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది. పత్తిని ఉంచేందుకు సురక్షిత వసతులు లేకపోవడంవల్లనే తమ పంట మొత్తం వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు సరైన ధర ఇవ్వకపోవడం కూడా వీరి ఆగ్రహాన్ని మరింత పెంచింది.