: అధికారంలోకి రాగానే పావలావడ్డీ రుణాలు పునరుద్ధరిస్తాం: బాబు


వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే పావలా వడ్డీ రుణాలను పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పాదయాత్ర సందర్భంగా కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో బాబు ప్రసంగించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో మహిళాభివృద్థి కుంటుపడిందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్య నానాటికీ తీవ్రరూపం దాల్చిందంటూ, విద్యాధికులు ఉద్యోగాలు లభించక వీధుల్లో తిరుగుతున్నారని చెప్పారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన పిమ్మట యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని బాబు భరోసా ఇచ్చారు. బడుగు రైతులకు రుణసాయం అందించి వ్యవసాయం లాభసాటి అని రుజువు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా, బాబు వెంట పాదయాత్రలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమా, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులున్నారు. 

  • Loading...

More Telugu News