: పరగడుపునే అయితే బరువు తగ్గవచ్చుట


వ్యాయామం అనగానే మనలో చాలామందికి చిరాకు. ఉదయాన్నే ఏం పరుగెడతాంలే... అనుకుని బద్దకించి టిఫిన్‌ చేశాక ఏదో చేశామంటే చేశాం అన్నట్టుగా కాసేపు నడక, లేదా జాగింగ్‌ చేసి ముగించేస్తారు. కానీ ఇలాకాకుండా ఉదయాన్నే పరగడుపునే వ్యాయామం చేయడం బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వ్యాయామం, లేదా ట్రెడ్‌మిల్‌పై నడవడం వల్ల ఇరవై శాతం కొవ్వును కరిగించుకోవచ్చని బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ చెబుతోంది. అలాగే ఆఫీసులో ముఖ్యమైన సమావేశాలప్పుడు ఒత్తిడి అనేది సాధారణం, ఇలాంటి సమయంలో కొన్ని నిముషాలపాటు స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేస్తే పావుగంటలో మనలో మార్పు కనిపిస్తుందట. ఎందుకంటే ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు మన మనసుని ఉత్తేజితం చేస్తాయట. అలాగే పలు రకాలైన ఆలోచనలతో రాత్రిపూట సరిగా నిద్ర పట్టనివారు చక్కటి వ్యాయామం చేయడం ద్వారా ప్రశాంతంగా నిద్ర పోవచ్చని నేషనల్‌ స్లీప్‌ ఫౌండేషన్‌ వారు చెబుతున్నారు.

అంటే ఫలానా సమయంలోనే చేయాలని నిబంధన లేకుండా మీకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు నిపుణులు చెప్పిన యోగాసనాలు, వ్యాయామాలను చేయవచ్చుని, ఇలా చేయడం ద్వారా ప్రశాంతంగా నిద్ర పడుతుందని ఈ ఫౌండేషన్‌ చెబుతోంది. ఒళ్లు నొప్పులను తగ్గించుకోవాలనుకునే వారు సాయంత్రంపూట కాసేపు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా కాసేపు వ్యాయామం చేసి సేదతీరండి. ఆరోగ్యంగా ఉండండి.

  • Loading...

More Telugu News