: గేదెనిచ్చి పెళ్లికూతుర్ని తోలుకెళుతున్నారు.. !


మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం  విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొ్న్ని గ్రామాల్లో పురుషుల సంఖ్య కంటే మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క అబ్బాయిలు ఎదురు కట్నాలు చెల్లిస్తున్నారు. అంతేనా, డబ్బు లేకపోతే ఏ గేదెనో ఇచ్చి పెళ్లికూతుర్ని తీసుకువెళుతున్నారట. అశోక్ నగర్, గునా జిల్లాల్లో ఇలాంటి వ్యవహారాలు అధికంగా జరుగుతున్నాయి. పెళ్లి కూతుళ్లకు ఏర్పడిన డిమాండ్ ఇక్కడి దళారుల పాలిట వరమైంది.

ఇంకేముంది, వెంటనే రంగంలోకి దిగిన ఈ దళారులు పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లో పెళ్లి కొడుకులకు అప్పగిస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర పోలీసులు దాడులు జరిపి షడోరా గ్రామంలో ముగ్గురు మైనర్ బాలికలను కాపాడారు. వీరిలో ఓ అమ్మాయి రూ. 50వేల నగదుతో పాటు ఓ గేదెకు అమ్ముడుపోగా, మరో బాలిక రూ. 35 వేలకు అమ్ముడైంది. ఇదిలావుంటే, తమకు ఎవరూ ఫిర్యాదు చేయడంలేదని అశోక్ నగర్ ఎస్పీ కుమార్ సౌరభ్ అంటున్నారు. 

  • Loading...

More Telugu News