: పేపర్‌ పరదాతో చక్కగా పరీక్ష రాయవచ్చు


పరీక్ష రాసే సమయంలో కొందరు పక్కనుండే వాళ్లని తెగ విసిగిస్తుంటారు. కాపీ కొట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి కాపీకి అవకాశం లేకుండా పేపర్‌ పరదాలతో పరీక్ష రాయాలని కొందరు విద్యార్ధులు నిర్ణయించుకున్నారు. దీంతో చక్కగా తలకు పేపర్‌ పరదాలను తయారు చేసేసుకుని, దాన్ని ధరించేసి పరీక్ష రాసేశారు కూడా.

బ్యాంకాక్‌లోని కాసెట్‌సార్ట్‌ వర్సిటీలో ఇటీవల జరిగిన ఒక పరీక్షలో విద్యార్ధులకు తలకు కాగితాలతో ఒక తెరలాంటిది కట్టేశారు. ఈ తెర వారి తలకు రెండు వైపులా రెండు పేపర్లను వేలాడేలా చేస్తుంది. దీంతో పక్కనున్న వారి పేపర్లోకి తొంగి చూసేందుకు అవకాశం ఉండదు. దీనికి సంబంధించిన ఫోటోలు ఫేస్‌బుక్‌లోకి ఎక్కడంతో సదరు వర్సిటీపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాము ఇలాంటివి ధరించమని ఒత్తిడి చేయలేదని, విద్యార్ధులే స్వచ్ఛందంగా అలా కాగితపు పరదాలను తగిలించుకుని పరీక్ష రాశారని, పైగా ఇలా చేస్తూ వారు తెగ ఎంజాయ్‌ చేశారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, పరీక్ష ప్రశాంతంగా రాయడానికి ఈ కాగితపు తెరలు చాలా బాగా తోడ్పడ్డాయని అధికారులు చెప్పడం విశేషం.

  • Loading...

More Telugu News