: మహారాష్ట్ర : కారులో సజీవ దహనమైన పారిశ్రామిక వేత్త


మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన ఓ పారిశ్రామిక వేత్త కారుకు మంటలు అంటుకోవడంతో సజీవ దహనమయ్యారు. ఉత్తర మహారాష్ట్రలోని గోవర్థనే గ్రామ సమీపంలో 'సీ అండ్ ఎం ఫార్మింగ్' అనే కంపెనీ వ్యవస్థాపక యజమాని రిచర్డ్ మార్షల్ డిసౌజా ప్రయాణిస్తున్న మారుతీ-800 కారుకు మంటలు అంటుకున్నాయి. అంగవైకల్యం కారణంగా ఆయన బ్రేక్, క్లచ్ లను చేతితోనే ఉపయోగిస్తారు. మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఆయన బయటకు రాలేక కారులోనే సజీవ దహనమయ్యారని సమాచారం. కాగా అసలు మంటలు ఏ కారణంగా కారుకు అంటుకున్నాయనేది నిర్ధారణ కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News