: రెండు నెలల్లో తహసీల్దార్లకు ల్యాప్ టాపులు: మంత్రి రఘువీరా


ప్రభుత్వోద్యోగులకు త్వరలోనే పలు సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని తహసీల్దార్లందరికీ రెండు నెలల్లో ల్యాప్ టాప్ లు అందజేస్తామని ఆయన వెల్లడించారు. అంతేగాకుండా, ఇళ్లు లేని ప్రభుత్వోద్యోగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు. గ్రామ రెవిన్యూ అధికారులకు ఇకనుంచి ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కాగా, హైదరాబాద్ లో రెవిన్యూ అకాడమీ స్థాపించనున్నట్టు మంత్రి తెలిపారు. 

  • Loading...

More Telugu News