: పాక్ లో రైలు పట్టాలపై బాంబు పేలుడు
పాకిస్థాన్ లో ఉగ్రవాద మూకలు మరోసారి రెచ్చిపోయాయి. బెలూచిస్థాన్ ప్రావిన్స్ లోని నవ్ తాల్ వద్ద ఉగ్రవాదులు రైలు పట్టాలపై బాంబును అమర్చి పేలుడుకు పాల్పడ్డారు. రావల్పిండి-క్వెట్టా జాఫర్ ఎక్స్ ప్రెస్ ఆ మార్గంలో వస్తుండగా ఈ పేలుడు జరిపారు. దీంతో, ఆరుగురు మరణించగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. పేలుడు ధాటికి నాలుగు బోగీలు ధ్వంసమయ్యాయి. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ఆరంభించారు. పాక్ భద్రత వర్గాలు దర్యాప్తు ఆరంభించాయి.