: డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్ లో స్థానాన్ని మెరుగుపర్చుకున్న సానియా


టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ఏకంగా టాప్ టెన్ లోకి దూసుకెళ్లింది. ఈ రోజు ప్రకటించిన ర్యాంకుల్లో సానియా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో ర్యాంక్ సాధించింది. ఇటీవల డబుల్స్ పైనే బాగా దృష్టిపెట్టిన సానియా చెైనా ఓపెన్, పసిఫిక్ ఓపెన్ టైటిళ్లను సొంతం చేసుకోవడంతో ఈ ర్యాంక్ ను దక్కించుకుంది. అటు ఆమె పార్ట్ నర్ జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్ పదమూడవ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News