: ఎంపీ సబ్బం హరి రాజీనామా
సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరోసారి రాజీనామా బాటపట్టారు. తాజాగా అనకాపల్లి లోక్ సభ సభ్యుడు సబ్బంహరి తన రాజీనామా లేఖను లోక్ సభ జనరల్ సెక్రటరీకి అందజేశారు. ప్రజల మనోభావాలను ప్రజాప్రతినిధులుగా తాము ప్రతిబింబించాల్సి ఉంటుందని చెబుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. అధిష్ఠానం తీరు ఏకపక్షంగా ఉండడంతో కినుక వహించి అప్పట్లో రాజీనామాలు చేశారు. స్పీకర్ ఆ రాజీనామాలు ఆమోదించకపోవడంతో ఎంపీలు మరోసారి రాజీనామా బాటపట్టారు. ఇప్పటికే లగడపాటి, ఉండవల్లి, సాయిప్రతాప్ లు తమ రాజీనామా లేఖలను లోక్ సభ జనరల్ సెక్రటరీకి అందజేశారు.