: లాలూ కోసం వచ్చే సందర్శకులను నియంత్రించండి: జైలు అధికారులు
దాణా కుంభకోణం కేసులో అరెస్టై రాంచి బిర్సా ముండా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కోసం వచ్చే సందర్శకులను నియంత్రించాలంటూ జైలు అధికారులు మొరపెట్టుకుంటున్నారు. అందుకోసం ఓ మేజిస్ట్రేట్ ను ఏర్పాటు చేయాలని కోరారు. సందర్శకులను ఓ పద్ధతి ప్రకారం జైలులోనికి పంపేందుకు మేజిస్ట్రేట్ కోసం తాము విజ్ఞప్తి చేశామని జైలు సూపరింటెండెంట్ వీరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. లేకుంటే, ఆ వచ్చినవారు కానిస్టేబుళ్ళతో ఘర్షణ పడుతున్నారని చెప్పారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలే కాకుండా వీఐపీలు కూడా లాలూను చూసేందుకు వస్తున్నారని, అటు జైల్లో ఉన్న మూడువేల మంది ఖైదీలు కూడా ఆయనను కలుస్తున్నారన్నారు. పనిలోపనిగా లాలూకు సరైన రక్షణ ఏర్పాటు చేయాలంటూ పోలీసులు బిర్సా ముండా జైలు అధికారులకు లేఖ రాశారు.