: తెలంగాణ ఏర్పడ్డాక భూపోరాటాలు చేస్తాం: నారాయణ
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తూ భూపోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో సీపీఐ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం పేరిట సీమాంధ్ర నేతలు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీగా భూములు కొంటున్నారని అన్నారు. సీపీఐతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనన్న రాఘవులు పక్క చూపులు ఎందుకు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.