: ఇక స్థానిక ఆలయాల్లోనూ టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్లు
అనుబంధ ఆలయాల అభివృద్థిపై టీటీడీ దృష్టి సారించింది. ఆయా ఆలయాల విశిష్టతను మరింత పెంపొందించేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్టు టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు. అందులో భాగంగా ఇక నుంచి ఆర్జిత సేవా టిక్కెట్లను స్థానిక ఆలయాల్లో ప్రత్యేక ఈ-కౌంటర్ల ద్వారా జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. జూన్ 1 నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.