: ప్రధానికి రష్యన్ సంస్ధ డాక్టరేట్
ప్రధాని మన్మోహన్ సింగ్ ను రష్యాకు చెందిన 'మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్' సంస్థ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఈ డాక్టరేట్ అందుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పేర్కొన్నారు. కాగా, మన్మోహన్ సింగ్ తన రష్యా పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అవనున్నారు.