: ప్రత్యక్ష ఆందోళన విరమించిన సీమాంధ్ర వైద్యులు


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, సీమాంధ్రలో ర్యాలీలు, ఆందోళనలు చేపట్టిన వైద్యులు నేటి నుంచి విధులకు హాజరు కావాలని నిర్ణయించారు. ఉద్యమం సందర్భంగా నిరుపేదలు వైద్యసాయం అందక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నందునే తాము ఆందోళనలను విరమిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల జేఏసీ కన్వీనర్ పిడకల శ్యామ్ సుందర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఈఎస్ఐ, వైద్య విద్యా కళాశాలలకు చెందిన ఆసుపత్రుల్లో నేటి నుంచి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. ప్రత్యక్ష ఆందోళనను విరమించినా, భిన్న రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. కాగా, శనివారం సీఎం కిరణ్ ను కలిసిన వైద్యుల జేఏసీ ఆయనకు ఓ మెమొరాండం సమర్పించింది. విభజన జరిగితే సీమాంధ్రకు వాటిల్లే కష్టనష్టాలను వారు తమ మెమొరాండంలో వివరించారు.

  • Loading...

More Telugu News