: ఆశారాంకు చుక్కెదురు
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లైంగిక వేధింపుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆశారాం తనపై మీడియా ఇష్టానుసారం కథనాలు రూపొందిస్తోందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కేసు విచారణపై కవరేజి చేపట్టకుండా మీడియాను నిరోధించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. అయితే, వాదనల సందర్భంగా.. విచారణపై మీడియా సక్రమంగా కవరేజి ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని ఆశారాం తరపు న్యాయవాది స్పష్టం చేశారు. తమ క్లయింటు ఆశ్రమాలను వేశ్యాగృహాలుగా చిత్రీకరిస్తూ మీడియా ఊహాకథనాలను అల్లుతోందని న్యాయవాది ఆరోపించారు. అయితే, ఈ వాదనలతో ఏకీభవించని సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది.