: సీఎం ప్రకటన సరికాదు: వీహెచ్


రాష్ట్ర విభజనకు వ్యతిరేకమన్న విషయాన్ని, కేంద్రం రోడ్ మ్యాప్ అడిగినప్పుడే సీఎం కిరణ్ చెప్పాల్సిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సర్వేలు చేయించే వ్యక్తి విజయవాడలో తన కెపాసిటీపై సర్వే చేయించుకోవాలని లగడపాటిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆఖరి అస్త్రం తమ చేతిలో ఉందని పలువురు సీమాంధ్ర నేతలు అంటున్నారని, మ్యాచ్ అయిపోయిన తరువాత చేతిలో బంతి పట్టుకుని ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయిందని వీహెచ్ తెలిపారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి తెలంగాణ ను అడ్డుకుంటామని చేసిన ప్రకటన సరికాదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News