: సీసీఎల్ లో సెమీస్ చేరిన తెలుగు వారియర్స్


సీసీఎల్ లో టాలీవుడ్ నటులు దుమ్మురేపారు! భోజ్ పురి దబాంగ్స్ జట్టుతో నేడు జరిగిన సీసీఎల్ లీగ్ మ్యాచులో తెలుగు వారియర్స్ జట్టు 99 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో, మొత్తం నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించిన తెలుగు వారియర్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు.

కాగా, పుణెలో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో తొలుత వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లకు 188 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తేజ (74), ఆదిత్య (65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అలరించారు. ఇక బౌలింగ్ లో రఘు (4 వికెట్లు) చెలరేగడంతో భోజ్ పురి దబాంగ్స్ 89 పరుగులకే చాప చుట్టేసింది. 

  • Loading...

More Telugu News