: ఆంధ్రప్రదేశ్ కు కిరణే చివరి సీఎం: బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి అని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. కిరణ్ లాంటి వ్యక్తిని దేశ చరిత్రలో చూడలేదన్నారు. తెలంగాణను అడ్డుకుంటామని తప్పుడు సంకేతాలిస్తూ, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని విమర్శించారు. విభజన తర్వాత ఆయన ఏ ప్రాంతానికీ సీఎం కాలేరని విద్యాసాగర్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ అంశంపై బీజేపీ తరపున కమిటీ వేసి నవంబర్ 5లోపు నివేదిక తయారు చేస్తామని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. నీటి వనరులు, ఆర్ధిక సమస్యలు, సీమాంధ్ర రాజధాని అంశం ఇత్యాది విషయాలపై వివరణాత్మకంగా తమ అధిష్ఠానానికి నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు.