: అల్ ఖైదా తరహాలో పేట్రేగిపోవాలనుకున్నాం: భత్కల్
భారత్ లో పలు పేలుళ్ల తర్వాత 'ఇండియన్ ముజాహిద్దీన్'(ఐఎమ్) పేరు మోసిన ఉగ్రవాద సంస్థగా ప్రాచుర్యంలోకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ముందు ముందు అల్ ఖైదా నెట్ వర్క్ తరహాలో పేట్రేగిపోవాలని తాము కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ తెలిపాడు. గతనెల అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అతడు విచారణలో ఈ విషయాలు వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా దేశాల్లో మాదిరే భారత్ లోనూ షరియా చట్టాన్ని తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పాడు. అయితే, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెన్సీకి ఏజెంట్ గా పని చేస్తున్న ఐఎమ్.. లష్కరే తోయిబాకు పూర్తిగా భిన్నమైనదని పేర్కొన్నాడు.