: 21 పైసలు పతనమైన రూపాయి
రూపాయి మళ్లీ పతనం వైపు పయనిస్తోంది. ఈ రోజు ట్రేడింగ్ ఆరంభంలో డాలర్ తో రూపాయి మారకం విలువ 21 పైసలు తగ్గింది. దీంతో, రూపాయి 61.48 వద్ద డాలర్ తో మారకం అవుతోంది. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్ కు డిమాండ్ అధికంగా ఉండటం రూపాయి క్షీణతకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.